Reavnth Reddy: మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుంది..! 8 d ago

TG: సీఎల్పీ సమావేశంలో ప్రజాప్రతినిధులపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. క్యాబినెట్ విస్తరణపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని, మంత్రివర్గ విస్తరణపై ఏవరేం మాట్లాడిన ఉపయోగం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, లేదంటే ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పారు. ప్రజాప్రతినిధులుగా మళ్లీ గెలవాలంటే ఇప్పటి నుంచే ప్రజల్లోకి వెళ్లాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. గతంలో రూ.2కే కిలో బియ్యం, ఇప్పుడు సన్న బియ్యం పథకం శాశ్వతంగా గుర్తుంటాయి చెప్పారు. కులగణన ద్వారా వందేళ్ల సమస్యను పరిష్కరించామని, అదే విధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేలా బిల్లు తెచ్చామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణకు శాశ్వత పరిష్కారం చూపామని, దేశంలోనే ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆదర్శం అని పేర్కొన్నారు.
తెలంగాణ పథకాలతో మోడీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని, వర్గీకరణ మోడీకి గుదిబండగా మారిందని చెప్పారు. ఒక్క ఎమ్మెల్యే కూడా సోషల్ మీడియా వాడటం లేదని, ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్లు నెగిటివ్ ప్రచారం చేస్తుంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారని, వీకెండ్ రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేది లేదని, పలువురు ఎమ్మెల్యేలు హైదరాబాద్కే పరిమితమవుతున్నారని, వీకెండ్ రాజకీయాలు చేయొద్దని హెచ్చరించారు. రేపటి నుంచి జూన్ 2 వరకు ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించాలని, పార్టీ లైన్ దాటితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మంత్రి పదవులు అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.